30 July, 2026 | 1:43 AM

ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

30-07-2026 12:44 AM
  1. ఆగస్టు 11 వరకు విధించిన ఉప్పరపల్లి కోర్టు 
  2. చంచల్‌గూడ జైలుకు తరలింపు

రంగారెడ్డి, జూలై 29 (విజయక్రాంతి) : లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కర్ణాటకకు చెందిన తోటి మహిళా ఐపీఎస్‌పై వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన తోటి మహిళా ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేశారు.

బాధితురాలు 2024 బ్యాచ్‌కు ఎంపికైనప్పటికీ, వ్యక్తిగత సెలవుల కారణంగా 2025 బ్యాచ్ తో కలిసి శిక్షణలో చేరారు. గతంలో ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేసి, కష్టపడి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ చూసి బాధితురాలు ఆకర్షితులయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణ సమయంలో మరింత బలపడి ప్రేమగా మారింది.

సీపీ సజ్జనార్ మీడియాకు తె లిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య కొద్దిరోజులకే తీవ్ర మనస్పర్థలు మొదలయ్యాయి. వేధింపులు తారాస్థాయికి చేర డంతో బాధితురాలు ఉదయ్‌కు దూరం గా ఉండటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆమెను మానసికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా, బాధితురాలిని భయపెట్టేందుకు ఏకంగా ఆయుధంతో బెదిరింపు లకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

బాధితురాలు వేరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ, ఉదయ్ వేధింపులు ఆపక పోగా.. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నాశనం చేస్తానని ని రంతరం బెదిరింపులకు దిగాడు. లొంగిపోవాలని లేదా సహకరించాలని హెచ్చ రించినా స్పందించకపోవడంతో, బాధితురాలు ఈ నెల 18న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ (అత్తాపూర్ పరిధి)లో ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయ్ నేరానికి పాల్పడినట్లు ఫోన్ సంభాషణలు, డిజిటల్ మెసే జ్‌లతో పాటు పలు కీలక ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు.