వాహనం ఆగిందా.. ప్రాణం గోవిందా!
- ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల పార్కింగ్
- వీటితో తరచూ ప్రమాదాలు
- భారీగా ప్రాణనష్టం
- పట్టించుకోని అధికారులు
మేడ్చల్, జూలై 29(విజయ క్రాంతి): హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మృత్యు రహదారిగా మారింది. అతివేగంతోపాటు ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చే యడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్ వే కావడం వల్ల వాహనా లు వేగంగా వెళుతుంటాయి. పార్కింగ్ చేయడానికి అవకాశం లేదు. కానీ భారీ వాహనా లు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల వెనుక నుంచి ఇతర వాహనాలు వచ్చి ఢీకొంటున్నాయి.
దీంతో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా అక్రమ పార్కింగ్ వాహనాల వల్లే జ రుగుతోంది. సాధారణంగా ఆగి ఉన్న వాహనాన్ని రాత్రి సమయాల్లో వెనుక నుంచి ఢీ కొనడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఆ గి ఉన్న వాహనం పార్కింగ్ లైట్లు వేయకపోవడం, ఎదురుగా వచ్చే వాహనం లైట్ల వల్ల ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం వంటి సంఘటనలు జరుగుతాయి.
ఔటర్ రింగ్ రో డ్డు మీద వన్ వే కావడం వల్ల ఎదురుగా లై ట్లు కళ్ళ మీద పడవు. ఇక్కడ జరిగే ప్రమాదాలు ఎక్కువగా పట్టపగలే జరుగుతున్నా యి. ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ల గరిష్ట వే గం గంటకు 120 కిలోమీటర్లు. ఈ వేగంతో వెళ్తున్న కారు నియంత్రణ సాధ్యం కాక వా హనాలను ఢీకొంటున్నారు. భారీ వాహనా లు సైతం వెనుక నుంచి ఢీకొంటున్నాయి. మే 1వ తేదీన శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద చౌటుప్పల్ నుంచి నంద్యాలకు బియ్యం లోడుతో వెళ్తున్న లారీని ని లుపగా వెనుక నుంచి వచ్చిన వ్యాగన్‌ఆర్ కా రు ఢీకొనగా అందులోని ఆరుగురు మరణించారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న అశోక్ లేలాండ్ వాహనాన్ని పా ర్కు చేయగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో నిలిపి ఉంచిన వాహనం లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మ రొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నర్సింగి గ్రామానికి చెందినవారు.
ఆరు నెలల క్రితం ఇన్నోవా వాహనంలో టిఫిన్ చేయడానికి ఆ గగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తా జాగా మంగళవారం నియో పోలీస్ వద్ద ఆగి ఉన్న సిమెంటు లారీని షిఫ్ట్ కారు ఢీకొనగా యువతి యువకుడు మరణించారు. ఇలాం టి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.
నిర్వహణలో నిర్లక్ష్యం
ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు హైదరాబాద్ నగరానికి రాకుం డా బయట నుంచి వెళ్లడానికి ఉపయోగపడుతోంది. దీని నిర్వహ ణ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. టోల్ వసూళ్ల నుంచి రింగు రోడ్డు నిర్వహణ ఈ సంస్థ చూడాలి. ఈ సం స్థ టోలు వసూలు పై చూపెడుతున్న శ్రద్ధ, రింగ్ రోడ్డు నిర్వహణపై చూపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూట్ పెట్రోలింగ్ చేసి వాహనాలు నిలుపకుండా చర్య లు తీసుకోవడం లేదు.
ఇటీవల రెండు బైక్‌లు ఈ రోడ్డుపై వెళ్లడం నిర్వహణ లోపానికి అద్దం పడుతోంది. బైక్‌లు, ఆటోలకు రింగ్ రోడ్డుపైకి అనుమతి లేకున్నా బైక్‌లపై వెళ్లడం గమనార్హం. రింగ్ రోడ్డు ఎక్కడానికి టోల్ గేట్ల వద్ద మాత్రమే అవకాశం ఉంది. టోల్ గేట్ల వద్ద సిబ్బంది ఉండ గా రెండు ద్విచక్ర వాహనాలు రింగురోడ్డు మీద ఎక్కాయి. అంతేగాక ఆరు నెలల క్రితం ఒక వ్యక్తి బైక్‌పై రింగ్ రోడ్డు ఎక్కి రాంగ్ రూ ట్లో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలను బట్టి నిర్వహణ సంస్థ ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది.
రింగ్ రోడ్డు డిజైన్ లోపం
వాహనాలకు అత్యవసర సమయాల్లో పార్కింగ్ చేయడానికి అవకాశం లేదు. వా హనం చిన్నపాటి మరమ్మతులకు గురైన, డ్రై వర్లకు, వాహనాల్లోని వారికి మల మూత్ర విసర్జనకు అవకాశం లేదు. విజయవాడ హై వే నుంచి ముంబై హైవే కలిపే పెద్ద అంబర్ పేట నుంచి పటాన్ చెరు వరకు 81 కిలోమీటర్లు.
ఈ దూరం వెళ్లడానికి గంట పైన సమ యం పడుతుంది. ఏ అత్యవసరమైన గంట పైన ఓపిక పట్టాల్సిందే. మధ్యలో అక్కడక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాష్ రూ మ్‌లు నిర్మిస్తే బాగుండేది. ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఎక్స్ప్రెస్ హైవే లకు ఇలాంటి సౌకర్యం ఉంది. భారీ వాహనాలకు రింగ్ రోడ్డు కింద కూడా పార్కింగ్ వసతి లేదు. భారీగా ప్రాణ నష్టం జరుగుతున్నందున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.






