రూ. 4 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం
30-07-2026 01:15 AM
కందుకూరు, జులై 29(విజయక్రాంతి): కందుకూరు మండలం గఫూర్ నగర్ నుండి జైత్వారం వరకు రూ. 4 కోట్ల సీఆర్‌ఆర్ నిధులతో నిర్మించనున్న 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను జైత్వారం సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. 2024లో శంకుస్థాపన జరిగి ఆగిపోయిన ఈ పనులను, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చొరవతో తిరిగి ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోకుండా కేఎల్‌ఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ వైస్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాణాప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జంగారెడ్డి, ఉపసర్పంచ్ నవీన్, నాయకులు పాల్గొన్నారు.






