విస్తా రంగా వర్షాలు
- జాలువారుతున్న జలపాతాలు
- భూపాలపల్లి జిల్లా గణపురంలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- ములుగు జిల్లాలో వరద నీటిలో మునిగిన ముప్పనపల్లి
- మేడారం జంపన్న వాగులో భక్తుడి గల్లంతు
- పలు గ్రామాల్లో తెగిన రోడ్లు
విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 29: గత రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కు రుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బుధవారం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది.
అతి భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని వా గులు పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి -పెద్ద గొల్లగూడెం మధ్య తెలంగాణ చత్తీస్‌గఢ్ రాష్ట్రా లకు రవాణా మార్గమైన ఇసుక వాగుపై డైవర్షన్ రోడ్డు వరదకు కొట్టుకుపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయా యి. భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో అత్యధికంగా గడచిన 24 గంటల్లో 269.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ములుగు జిల్లా వాజేడు లో 246.3 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన కన్నాయి గూడెం, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట, మహదేవ్పూర్, కాటారం, మలహర్ రావు, ముత్తారం, భూపాలపల్లి, గణపురం మండలాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. మేడా రం వద్ద జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లా గణపురం వద్ద మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
గణపురం మండలంలో ఓపెన్ కాస్ట్ (ఓసీ -3) బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. యంత్రాలను ఎక్కడికి అక్కడే నిలిపివేశారు. ములుగు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాం తమైన బోగత జలపాతం భారీ వర్షాలతో ఉదృతంగా జాలువారుతుండడంతో సందర్శకులకు అనుమతి నిలిపివేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ము ప్పనపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది.
ఇళ్లల్లోకి చేరిన బురద నీటితో గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు నీటిలో తడిసి పాడయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుండి వరద ప్రవాహం రావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదిక్రమేపి పెరుగుతుంది. బుధవారం సాయంత్రం వరకు మహదేవపూర్ మండలంలో172.4, పలిమెల మండలంలో అత్యధికంగా 264.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మహాదేవపూర్ మండలంలోని చంద్రుపల్లి పల్లి వద్ద ఉన్న కలవర్ట్ పై నీరు ప్రవహిస్తునడం వల్ల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలం కేంద్రం లో చెట్టు పడి రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ కు 74వేల 390 క్యూసెక్కుల వరద నీరు రాగా బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.
పొంగిపొర్లుతున్న నల్ల వాగు మత్తడి
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నల్ల వాగు మత్తడి పొంగిపొర్లుతున్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్, గాంధారి వాగులు జలకలను సంతరించుకున్నాయి. ఈ వాగులు ప్రభావం పెరిగితే సమీ పంలోని చెరువులు కుంటలు పొంగి పొర్లుతాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మం డలంలో కప్పల వాగు వరద ఉధృతికి కుంగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతుండటం తో మంజీరా నది పరివాహక ప్రాంత రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల మధ్య నిలిచిన రాకపోకలు
జగిత్యాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ధర్మపురి మం డలంలోని అనంతారం వాగు, నేరెళ్ల వాగు జాతీయ రహదారి పైనుంచి ప్రవహిస్తుండటంతో జగిత్యాల మధ్య రాకపో కలు నిలిచిపోయాయి. కల్లెడ నుంచి నుంచి యశ్వంతరావుపేట, వెల్గటూర్ మీదుగా వా హనాలను మళ్లించారు. ఆక్సాయి పల్లె మధ్య రహదారికి గండి పడటంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నేరెళ్ల తో పాటు పలు గ్రామాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ధర్మపురి మండలంలోని ఆక్సాయిపల్లె లోలెవల్ వంతెన నీటిలో మునిగి పోయింది. దీంతో జగిత్యాల, మంచిర్యాల వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ జూలై మాసంలో సాధారణ వర్షపాతం కంటే 40 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంత జలకల సంతరించుకుంటుంది. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్, స్వర్ణ వాగు ప్రాజెక్ట్, భైంసా గడ్డన్న శుద్ధ వాగు ప్రాజెక్ట్, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి వర్షపు వరద ప్రారంభమైంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పరిహార ప్రాం తంలో భారీ వర్షాలు కురవడంతో 15వేల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే 686 అడుగులు చేరినట్టు తెలిపారు. స్వర్ణ , భైంసా శుద్ధ వాగు గడ్డన్న వాగు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రారంభమైంది. జిల్లాలోని 620 చెరువుల్లో నీళ్లు లేక బోసిపోయి కనిపించగా కురిసిన వర్షాలకు 20 శాతం చెరు వులు నిండుకున్నాయి. కాగా సోం రం రోడ్డు కొట్టుకుపోయింది. కడెం, పెంబి, సారంగాపూర్ తదితర మండలాల్లో వాగు లు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో వాగు లు, వంకలు పొంగిపొర్లాయి. బుధవారం 80.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇంకా పది శాతం లోటు వర్షపాతమే నమోదైంది.
జంపన్న వాగులో భక్తుడి గల్లంతు
ములుగు జిల్లా మేడారం జంపన్న వాగు లో భక్తుడు గల్లంతయ్యాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్య (20) నలుగురు స్నేహితులతో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మ, వనదేవతల దైవతల దర్శనం కోసం వచ్చాడు. జంపన్న వాగులో స్నానం చేసే ప్ర యత్నంలో వరద తీవ్రతకు కొట్టుకుపోయా డు. విషయం తెలుసుకున్నవెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నరేష్, పోలీ సులు తిమ్మయ్య కోసం గాలింపు కొనసాగిస్తునారు.
ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతం 11,735 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తి స్థాయి సా మర్థ్యం20 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ: 8.63 టీఎంసీలు ఇన్‌ఫ్లో: 11,735 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫక్ష్ల ్ల450 క్యూసెక్కులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షా ల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కరీంనగర్ జిల్లాలో మానేరు, మోయతుమ్మెద, చిలుక వాగుల్లో ప్రవాహం మొదలైంది.
ఎల్‌ఎండీ రిజర్వాయర్లోకి బుధవారం ఉదయం నుంచి 403 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్లో 5.490టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు పరుగులు పెడుతున్నది.
ప్రాజెక్టు సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1750 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలువాగు ప్రవహిస్తుండడంతో మధ్యమానేరులోకి ఇన్ఫ్లో పెరిగింది. 27.55టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 390 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. ఇల్లంతకుంట మండలంలో 3.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్లోకి 1400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
తాళిపేరు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తివేత
తాళిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తివేశారు. గేట్ల ద్వారా 30,024 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 27,395 క్యూసెక్కులుగా నమదోవుతున్నది. ప్రస్తుత నీటి మట్టం 73.39 మీటర్లు. ఉదయం 9.30 గంటలకు అధికారులు తీసుకున్న కొలతల ప్రకారం ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో 22 గేట్ల ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 6500 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395. 40అడుగుల తో 7.139 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతోంది.
పెద్దపల్లి జిల్లా మంథని సమీపం లోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి (సుందిళ్ల) బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం ఫ్రీ ఫ్లో పరిస్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 119.84 మీటర్లు (పూర్తి స్థాయి నీటి మట్టం: 130.00 మీటర్లు). ప్రస్తుత నీటి నిల్వ: 8.83 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 26,141 క్యూసెక్కులు, ఔ ట్‌ఫ్లో 26,141 క్యూసెక్కులు, బ్యారేజ్‌లోకి వ స్తున్న 26,141 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వా రా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.
నేడు, రేపు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయి. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురువగా, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, జగిత్యాల్, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. మిగితా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
నేల కూలిన వందేళ్ల మామిడి చెట్టు
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి ఇంద్రవెల్లి ప్రధాన రహదారి పక్కన ఆర్ అండ్ బీ శాఖ గ్యాంగ్ మెన్ లుగా విధులు నిర్వహించిన వారు వం దేళ్ల క్రితం మామిడి చెట్టును నాటారు. ఆ చెట్టు బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డు పక్కన పడిపోయింది. ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఎస్సై సాయన్న ప్రోక్లీన్ సా యంతో రోడ్డుపై నుంచి తొలగించారు.






