కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
- జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ నూతన అధ్యక్షుడు రాజిరెడ్డికి ఘన సన్మానం
- ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు నల్లవెల్లి అంజిరెడ్డి
ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా జలమండలి కేంద్రంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం పాటు కార్మికుల హక్కులు, చట్టాల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేస్తున్నదని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లవెల్లి అంజిరెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ లోని చిలకలగూడ రిజర్వాయర్ లో ఇటీవల జరిగిన వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాజిరెడ్డిని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లవెల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జలమండలిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా వ్యవహరించడం వల్లే కాంగ్రెస్ బలపరిచిన రాజిరెడ్డి ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ బలపరిచే అభ్యర్థినే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రవికుమార్, శివ, రాఘవేంద్ర, సురేష్ కుమార్, సూర్యప్రకాష్ ముదిరాజ్, రామకృష్ణ, జి. ఎన్ చారి, వైపి రాజు తదితరులు పాల్గొన్నారు.






