18 April, 2026 | 5:14 PM

మరిమడ్ల గ్రామంలో టీబీ ముక్త్ అభియాన్: ఛాతీ ఎక్స్‌రేలు నిర్వహణ

18-04-2026 04:17 PM

కోనరావుపేట,విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో టిబి ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఛాతీ ఎక్స్‌రేలు నిర్వహించారు.గ్రామస్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టిబి వ్యాధి గుర్తింపుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. సురేష్ కుమార్ పర్యవేక్షణలో సూపర్‌వైజర్లు రషీద్, పద్మజ, ఎస్టిఎస్ జేత్య, గంగాధర్, రేడియోగ్రాఫర్ బాలు, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. టిబి వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సమయానికి చికిత్స అందించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు.