పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యం
తూప్రాన్, ఏప్రిల్ 17: ప్రజా పాలనలో భాగంగా స్పెషల్ డ్రైవ్ శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ నాల్గవ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగో వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం అని అందుకని ప్రజలందరూ చుట్టుపక్కల అంత శుభ్రత ఉంచి బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయొద్దని మునిసిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలు భాగస్వాములు కావాలని అప్పుడే పరిశుభ్రతకు సాధ్యమవుతుందని ప్రజలకు సూచించారు.
మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీ పరిశుభ్రతలో అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని ప్రజల సహకారం అవసరమని చుట్టుపక్కల పిచ్చి మొక్కలు ఉండకూడదని దోమలు వ్యాపించి ప్రజలు అనారోగ్యం పాలవుతారని కాబట్టి మనిషి భద్రత ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే ముఖ్యమని ప్రజలకు సూచించారు.
మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పరిశుభ్రత ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగానే ఉంటారని ఎండాకాలం దృశ్య సిబ్బంది కూడా ఎండను చూసి పని చేసుకోవాలని అలాగే ప్రతి వార్డులో సైనిటైజర్ తప్పనిసరి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ షర్మిల రాములు, మున్సిపల్ శానిటైజర్ ఆఫీసర్ మధు, ఎలక్ట్రిషన్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి, జవాన్ ఇర్ఫాన్, వినోద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






