18 April, 2026 | 3:05 AM

ఇబ్రహీంపట్నంలో టెన్షన్.. టెన్షన్..

18-04-2026 01:31 AM
  1. ఫార్మాసిటీ భూములలో అవినీతి జరిగిందంటూ 

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపణ

అవినీతి ఆవరణలపై  చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే సవాల్

మంచిరెడ్డి కిషన్ రెడ్డి అరెస్టు  సాగర్ రోడ్డుపై  కార్యకర్తల బైఠాయింపు 

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 17:  ఫార్మాసిటీ విషయంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ టెన్షన్ గా మారిపోయింది. ఫార్మాసిటీ భూముల్లో  మాజీ ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి. దీంతో మాజీ ఎమ్మెల్యే తాను అవినీతికి పాల్పడలేదని ధైర్యం ఉంటే ఫార్మాసిటీ రైతుల ముందే మేడిపల్లిలో చర్చకు రావాలని సవాలు విసరగా శుక్రవారం పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలతో మేడిపల్లి బయలుదేరుతుండగా  బీ ఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ను పోలీసులు నిర్బంధించారు.

దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సాగర్ రహదారిపై బైఠాయించి, రాస్తా రోకో చేస్తూ, ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాస్తారోకోతో సాగర్ రహదారి పై ట్రాఫిక్ స్తంభించుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని   చదరగొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ..... ఫార్మాసిటీ భూముల విషయంలో తాను ఒక్క వంద రూపాయలు కూడా రైతుల దగ్గర తీసుకున్న దాఖలాలు లేవని తాను అవినీతి చేసినట్లుగా ఇప్పటికైనా ఆధారాలతో సహా స్థానిక ఎమ్మెల్యే నిరూపిస్తే రాజకీయంగా సన్యాసం తీసుకుంటానని, నిరూపించకపోతే ఎమ్మెల్యే కూడా రాజకీయం సన్యాసం తీసుకోవాలని మరోసారి సవాలు విసిరారు.

ఫార్మాసిటీ రైతులతో మేడిపల్లిలో బహిరంగ చర్చకు  రావడానికి సిద్ధమైతే ఎమ్మెల్యే వీ తప్పుడు ఆరోపణలు కాబట్టే  అక్కడికి రాకుండా తమను వెళ్ళనీయకుండా పోలీసులతో నిర్బంధించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇంకా బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోలు, ప్రొసీడింగ్లతో ప్రారంభమైన పనులను  తాను చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే తొర్రూరు, మునగనూరు ప్రాంతాల్లో  భూములు కబ్జాలు పెడుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని, అవినీతికి అక్రమాలకు మారుపేరు మల్ రెడ్డి అని అన్నారు.

కాంట్రాక్టర్ల దగ్గర సైతం  పర్సంటేజ్ లెక్కల కమిషన్  దండుకుంటూ నాసిరకమైన పనులు చేపిస్తున్నారని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు  తప్పుడు విమర్శలు చేస్తే  తాము సహించేది లేదని, తొందరలోనే  ఎమ్మెల్యే కబ్జాలు , అవినీతిపై  ప్రజల్లో నిరూపిస్తామన్నారు. తమ వాళ్లపై కేసులు పెట్టిన, దౌర్జన్యం చేసిన ఇక సహించేది లేదని  దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరించారు.