18 April, 2026 | 3:01 AM

అమెజాన్ ‘నవాని రైసింగ్’ శిక్షణ పూర్తి

18-04-2026 01:32 AM

నేదునూరు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఘన స్వాగతం

కందుకూరు, ఏప్రిల్ 17(విజయక్రాంతి): అమెజాన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ‘నవాని రైసింగ్ జనరేషన్ ఫెలోషిప్ ఒమేగా’ జాతీయ స్థాయి శిక్షణ శిబిరంలో పాల్గొన్న నేదునూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎస్. హనిప్రియ, జి. సమీక్షలకు పాఠశాలలో ఘన స్వాగతం లభించింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణను విజయవంతంగా ముగించుకుని వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ విష్ణుప్రియ మరియు అధ్యాపక బృందం అభినందించారు.

తెలంగాణ రాష్ట్రం నుండి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నేదునూరు విద్యార్థులు ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు.నాయకత్వ లక్షణాలు, లక్ష్య సాధనపై అవగాహనతో పాటు రోప్ వే, రాక్ క్లైంబింగ్, జీప్ లైన్ వంటి సాహస క్రీడల్లో విద్యార్థులు శిక్షణ పొందారు. విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పాఠశాల పేరును నిలబెట్టినందుకు గర్వంగా ఉందని ప్రిన్సిపల్ విష్ణుప్రియ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.