17 July, 2026 | 3:00 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

17-07-2026 02:42 AM

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ రావు

మహబూబాబాద్, జులై 16 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా పార్టీ క్యాడర్ కృషి చేయాలని, వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పాటుపడాలని రాష్ట్ర కార్యదర్శి గౌతం రావు పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నెల్లికుదురు మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే విధంగా కేంద్రం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశాలపై దృష్టి సారించాలని, ప్రజల్లో మార్పు కోరే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కోల్పోకుండా సహకరించాలని కోరారు.