4 August, 2026 | 1:48 AM

ఎరువుల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్

04-08-2026 12:43 AM

నాగిరెడ్డిపేట్,ఆగస్టు 3 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా ఐతే యూరియా పంపిణీ కోసం ప్రత్యేక అప్లికేషన్ను ప్రవేశపెట్టి పారదర్శకంగా రైతులకు సకాలంలో యూరియా పంపిణీకి చర్యలు చేపట్టిందో, ధీనిని ఆదర్శంగా తీసుకొన్న భారత ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్ను ప్రవేశపెట్టనుంది. ఫ్రేంవర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ పేరుతో ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ఈయాప్ ఆగస్టు ఆరవ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా  డీలర్స్కు ఎల్లారెడ్డి డివిజన్ తరుపున సోమవారం లింగంపేట్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడ్డది.యాప్ ముఖ్య విషయాలు ఆధార్ లేదా ఫార్మర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాల ఎరువుల ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా రైతులకు వితరణ జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏడిఏ సుధా మాధురి, ఏవో సాయికిరణ్,ఆయా మండలాల ఏవోలు, ఏఈవోలు,డీలర్లు పాల్గొన్నారు.