calender_icon.png 12 February, 2026 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి పట్టాను అందుకున్న విద్యార్థిని వినయశ్రీ

12-02-2026 01:55:31 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని పి. వినయశ్రీ తమ విశిష్టమైన పరిశోధనకు గాను ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) పట్టాను అందుకున్నారు. ఆమె పరిశోధన శీర్షిక స్మార్ట్ హెల్త్ కేర్, బ్లాక్ చైన్ విత్ రోల్ బేస్డ్ అండ్ ఆర్టి బ్యూట్-బేస్డ్ ఆక్సెస్ కంట్రోల్ యూజింగ్ డిపిఓఎస్ అండ్ పి.బి.ఎఫ్.టి ఈడాక్టరల్ పరిశోధనను డాక్టర్ ఎ. మల్లికార్జున రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ కృత్రిమ మేధస్సు విభాగాధిపతి మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు.

వారి నైపుణ్యపూర్వక మార్గనిర్దేశం, శాస్త్రీయ దృక్పథం నిరంతర ప్రోత్సాహం ఈ పరిశోధనకు కీలక పాత్ర వహించాయి. ఈవిశిష్ట విజయ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్-చాన్స్‌లర్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్, సి.ఎస్.ఇ డీన్, పరీక్షల నియంత్రణాధికారి, కృత్రిమ మేధస్సు విభాగాధిపతి, అధ్యాపకులు, సహచరులు, కుటుంబ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆమె భవిష్యత్ పరిశోధన, ఆవిష్కరణలు, వృత్తిపరమైన ప్రయాణంలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.