10 July, 2026 | 3:07 AM

సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ శ్రీకారం

10-07-2026 02:06 AM

పార్టీలకతీతంగా సేవలందిస్తానని వెల్లడి

నాగల్గిద్ద, జూలై 9: నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ శివశరణప్ప శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధే తన ధ్యేయమని, సీసీ రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామస్తుడికి అందుబాటులో ఉంటూ మోర్గిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. సర్పంచ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు సర్పంచ్ అన్నపూర్ణ శివశరణప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.