22 May, 2026 | 10:13 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఎన్నికల వరకే రాజకీయాలు

16-02-2026 02:54 PM

ఆ ఉద్దేశంతోనే బరిలోకి దిగాం

కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులను కలుస్తాం

నిధులు ఇవ్వకపోతే వదిలిపెట్టాం

హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠం(Karimnagar Mayor) భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల వరకే రాజకీయాలు.. ఈ తర్వాత రాజకీయాలు పక్కనపెట్టాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని సూచించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తామని తెలిపారు. బీజేపీ మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేదని లేదని స్పష్టం  చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో తాము గెలిచినా... మేయర్ గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు చేశాయని ఆరోపించారు.