22 May, 2026 | 9:03 PM

Breaking News

మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •  

ఆలయం పట్ల ఉదారత చాటిన బట్టు భూమయ్య

16-02-2026 02:57 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి మండల కేంద్రానికి చెందిన బట్టు భూమయ్య గౌడ్ తమ యొక్క ఉదారతను చాటుకున్నారు. తమ కులదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అత్యంత చొరవ తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అధునాతనమైన రూ. 75000/- విలువగల మార్బుల్స్ (పాలరాయి) వేయించి, ఆలయ సుందరీకరణకు తన వంతు సహకారాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతమని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే పాలరాయి వేయించినట్లు బట్టు భూమయ్య తెలిపారు. బట్టు భూమయ్య సేవల పట్ల గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.