బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి పథకం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ ను మధిర వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంబించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పలు విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంప్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఆర్ధికంగా నష్ట పోవద్దని,ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన చికిత్సలు అందించడం జరుగుతుంది.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలు వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయించారని అంతేకాక ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంచారని దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బలుసుపాటి జయరాజు, వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్,డాక్టర్ అశ్విని,ఉప సర్పంచ్ వేమిరెడ్డి రామిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాసరెడ్డి,బనిగండ్లపాడు మాజీ సొసైటీ చైర్మన్ శీలం అంకిరెడ్డి,పలు విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు, వైద్యసిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




