నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం
10-04-2026 08:13 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య రెండవ కుమార్తె మల్యాల అలేఖ్య (29) ఏప్రిల్ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తండ్రి దేవయ్య లేచి చూసేసరికి అలేఖ్య ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన దేవయ్య వెంటనే కోనరావుపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువతి అదృశ్యం పై ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.




