అటకెక్కిన ఆయుర్వైద్యం!
- డాక్టర్ ఫార్మసిస్ట్ బదిలీతో నిలిచిన ఆయుర్వేద వైద్య సేవలు
- రెండు సంవత్సరాలుగా తెరుచుకొని వైద్యశాల
- పట్టించుకోని అధికారులు- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- వెంటనే వైద్యుడిని నియమించి సేవలు పునరుద్ధరించాలని ప్రజల వేడుకోలు
పాలకవీడు, ఆగష్టు 10 : ఆయుర్వేద వై ద్యం తో ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవ ని ఉద్దేశంతో ఇప్పటికీ అనేకమంది అదే వై ద్య విధానాన్ని అనుసరిస్తుంటారు. పాలకవీ డు మండలంలోని చాలామంది తమ ఆ రోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఇదే వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే మండలంలో కొన్ని సంవత్సరాల పా టు సజావుగా నిర్వహింపబడినటువంటి ప్ర భుత్వ ఆయుర్వేద వైద్యశాల ఉన్నటువంటి ఒక్కసారిగా మూతపడింది. దీంతో మండలంలోని పలువురు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
అందని ద్రాక్షగా ఆయుర్వేద వైద్యం
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వే ద వైద్యశాల రెండేళ్ల నుండి తెరుచుకో వడం లేదు. దీంతో ప్రజలకు ఆ యుర్వేద వైద్యం అందని ద్రాక్షగా మిగిలింది. మూ డు సంవత్సరాల క్రితం జానపహాడ్ లో హాస్పిటల్ నిర్వహించగా ఉన్నత అధికారులకు మండల కేం ద్రంలో హాస్పిటల్ నిర్వహించాలని ప్రజలు కోరగా దానిని మండల కేంద్రంలోనీ ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహించడం జరుగుతుం ది.
మండల కేంద్రంలోకి వచ్చిన తరువాత 8 నెలలు పాటు వైద్య సదుపాయాలు అధించిన వైద్యధికారి బదిలీ చేయడం జరిగింది. వైద్యాధికారి, ఫార్మసిస్టు బదిలీ చేసిన రోజు నుండి తీసిన వారే లేరని ప్రజలు వాపోతున్నారు. ఈ వైద్యశాలలో డాక్టర్ తో పాటు ఫార్మసిస్టు పోస్టును భర్తీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు కళ్ళకు కట్టి నట్లు కనిపిస్తుంది. రోగాన్ని పూర్తిగా నిర్మూలించే శక్తి ఆయుర్వేదం, హెూమియో, యునానీలో ఉన్నప్పటికీ దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గదులకు పరిమితమైన మందులు
ప్రభుత్వం లక్షలు వెచ్చించి సరఫరా చేస్తున్న ఆయుర్వేద మందులు డాక్టర్, సిబ్బంది లేని కారణంగా అవి గదులకే పరిమితమవ్వడంతో చెదలు పట్టిపోతు న్నాయి. ప్రస్తుతం ఈ ఆయుర్వేద వైద్యశాలలో అటెండర్ మాత్రమే ఉండడం గమనా ర్ధం. ఆ అటెండర్ కూడా ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియకుండా పోయింది. ఎన్నో ఏ ళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆ యుర్వేద ఆసుపత్రి ఇప్పుడు నిరుపయోగంగా మారింది.
పట్టించుకోని అధికారులు
మారుమూల గ్రామాల్లో ప్రజలకు ఇప్పటికీ ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఎక్కువే. ప్రస్తుతం ప్రజలు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండడంతో ఎ క్కువగా వారు ఆయుర్వేద వైద్యాన్ని నమ్ముకుంటారు. ఇక్కడ పనిచేసిన వైద్యాధికారి బదిలీ కావడంతో గ్రామాల్లో వైద్య సేవలు అందక ప్రైవేటు వైద్యం బాధపడుతున్నారు.
ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై ప ట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారంటూ ప్ర జలు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుండి ఇక్కడ వైద్య సేవలు అందకపోవడంతో దీర్ఘకాలిక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యాధికా రితో పాటు సిబ్బందిని నియమించి వైద్య సే వలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
డాక్టర్‌నీ నియమించాలి :
ఆయుర్వేదం వైద్యంతో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల తక్కువైతున్నాయి డాక్టర్ బదిలీ అయినప్పటి నుం డి మందులు ఇచ్చే వాళ్ళు లేక ప్రెవేట్ హాస్పిటల్ లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి మందులు తెచ్చుకోవలసింది వ స్తుంది. అధికారులు చొరవ చూపి డా క్టర్ నియమించి ఆయుర్వేద వైద్యమును అందుబాటులోకి తీసుకురావాలి.
బుర్రి మహేందర్, పాలకవీడు






