11 August, 2026 | 2:22 AM

ఘనంగా హర్ ఘర్ తిరంగా

11-08-2026 12:36 AM
  1. రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న బీజేపీ నేతలు
  2. తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నేతలు
  3.    14న ట్యాంక్ బండ్ వద్ద భారీ తిరంగా యాత్ర
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సోమవా రం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. తమ ఇళ్లపై జాతీయ జెండా ను ఎగురవేశారు. తార్నాకలోని తన నివాసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తమ నివాసాలపై జాతీ య జెండాను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎగురవేశారు.

కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములై ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని వారు కోరారు. అలాగే బీజేపీ ఎంపీలు కె లక్ష్మణ్, అర్వింద్ ధర్మపురి న్యూఢిల్లీలోని తమ నివాసాలలో జెండాను ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, జెండాతో సెల్ఫీ తీసుకుని వందేమాతరం గీతంతో హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు.

ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని తమ ఇంటిపై ఎగురవేశారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, తూళ్ల వీరేందర్‌గౌడ్ జెండా ఎగురవేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బం డ్ వద్ద భారీ తిరంగా యాత్ర చేపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు.

‘తిరంగా యాత్ర’ ఏ ఒక్క పార్టీకో, రా జకీయాలకో సంబంధించింది కాదని... మన భారతదేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి, వికసిత భారత్ సంకల్పం తో చేపడుతున్న యాత్ర అని చెప్పారు. హైదరాబాద్ ప్రజలందరూ కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, దేశం కోసం తిరం గా యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.