11 August, 2026 | 2:48 AM

ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు శిక్షణ

11-08-2026 01:34 AM

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల టౌన్, ఆగస్టు 10: కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మం చిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్త్స్ర, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో రాణించేందుకు 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్‌ ప్రతినిధులు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి గల వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేయడం ద్వారా మీ పేరు నమోదు చేసుకొని కోచింగ్ లో చేరవచ్చన్నారు. ఈ శిక్షణను పోటీ పరీక్షలలో ఎంతో అనుభవం కలిగిన విన్నర్స్ ఐకాన్ స్టడీ సర్కిల్, కెరియర్ మిత్ర నాగరాజ్, అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ బృందంతో అందించనున్నామని, పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ అంశా లపై నాణ్యమైన శిక్షణను అందించనున్నామన్నారు.

శిక్షణలో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇంగ్లీష్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ అంశాలుతదితర పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన సబ్జెక్టులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని, 60 రోజుల శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్ శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం క్యూఆర్ కోడ్ పోస్టర్ లను మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు.