11 August, 2026 | 2:48 AM

ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి

11-08-2026 01:27 AM

భైంసా, ఆగస్టు 10 ( విజయ క్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ముధో ల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ అ న్నారు. సోమవారం భైంసా పట్టణంలోని తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు.

జా తీయ జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడేలా ప్రజలు స్వచ్ఛందంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 13న భైంసాలో నిర్వహించనున్న తిరం గా ర్యాలీని విజయవంతం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.