గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించిన సి.వి.కా పౌల్ట్రీ ఫార్మ్ యాజమాన్యం
చేగుంట ఆగస్ట్ 10 (విజయ క్రాంతి) : చేగుంట మండలంలోని పెద్ద శివనూర్ గ్రామ పంచాయతీ లో గల సి వి కా పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళ గ్రామం లొ ఈగలు, దోమల వల్ల పెద్ద శివనూర్, చుట్టూ పక్కల తండా లొ దుర్వాసన వస్తుండడంతో సోమవారం గ్రామ సర్పంచ్ నర్సిములు,గత రెండు రోజుల క్రితం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా , విజయక్రాంతి లొ వార్త ప్రచురించగా,, యాజమాన్యం కౌశిక్ స్పందించి,గ్రామం లో ఉన్న మురుగు కాలువల్లో మట్టి, చెత్తాచెదారం తొలగించారు.
గ్రామాల్లో పరిశుభ్రత, ఆరోగ్య నిర్వహణలో భాగంగా సి వి కా యాజమాన్యం ట్రాక్టర్ ద్వారా మందులతో పిచికారి చేయించడం జరిగింది, ఈ సందర్బంగా పౌల్ట్రీ ఫార్మ్ యజమాని కౌశిక్ మాట్లాడుతూ గ్రామం లొ ఈగలు, దోమలు ద్వారా దుర్వాసన రాకుండా, చెత్త, మురుగు నీటి నిల్వలను ఉన్న ప్రదేశంలో గ్రామపంచాయతీ సిబ్బంది తో కలిసి గ్రామంలో దోమలు, ఈగల దుర్వాసన రాకుండా గ్రామంలో దోమల మందు, పిచికారి చేయించడం జరిగిందని అన్నారు.
మురుగు కాలువల్లో మట్టి నీరు నిలిచిపోయి దుర్గంధం
దోమలు పెరిగి, రోగాలు వ్యాప్తి చెందుతాయి అలా జరుగకుండా పరి శుభ్రంగా ఉంచాలన్నదే తన దృఢ సంకల్పం.అని అన్నారు, ఈ కార్యక్రమం లొ సర్పంచ్ నర్సిములు, ఉపసర్పంచ్ మల్లేష్, పంచాయతీ సెక్రటరీ రాజు, వార్డ్ సభ్యులు శ్రీ రాములు, బండారి రాములు, మాలోత్ రమేష్ , గ్రామస్తులు, తలారి అశోక్, ప్రశాంత్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.






