11 August, 2026 | 2:47 AM

మిషన్ భగీరథ పైపులైన్ పనుల ప్రారంభం

11-08-2026 12:03 AM

ధర్మపురి,ఆగస్టు10(విజయక్రాంతి):వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూసేందుకు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ సహకారంతో మిషన్ భగీరథ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ బండమీది కవితగోపి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఈ కార్యక్రమంను నిర్వహించారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) కింద మంజూరైన 5 లక్షల రూపాయల వ్యయంతో ఈ పైపులైన్ నిర్మాణ పనులను వారు చేపట్టారు.

ఈ పనుల ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు అందజేయడం జరుగుతుందని, త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గ్రామ సర్పంచ్ బండమీది కవిత గోపి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు,మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు,జిల్లా అధికార ప్రతినిధి గుండాటి సందీప్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్,బీసీ సెల్ అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్,వార్డ్ సభ్యులు నక్క సురేష్,గుమ్ముల లక్ష్మీ,నాయకులు గుమ్ముల వెంకటేశ్,వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, బుసర్తి గంగారం,కారొబార్లు పంబా ల సతీశ్,లకుమల్ల సాయి పాల్గొన్నారు.