20 March, 2026 | 10:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

గ్రామాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన

19-03-2026 12:00 AM

ఉట్నూర్, మార్చి 18 (విజయక్రాంతి):  మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు డబ్బులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం జరుగుతోందని హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ  బిక్షపతి రావు స్పష్టం చేశారు. బుధవారం ఉట్నూర్ ఏజెన్సీ ప్రాం తంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో మాదకద్రవ్యాలపై ప్రజలు, యువతకు, విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై   అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

ఏజెన్సీ ప్రాంతంలో చాలామం ది రైతులు గంజాయి సాగుపై దృష్టి సారించి డబ్బుల కోసం గంజాయి సాగు చేస్తున్నారన్నారు. గంజాయి సాగు చేయడం వల్ల యువత విద్యార్థులు చెడు దారిన వెళ్తున్నది రైతులు గమనించడం లేదన్నారు. గంజాయి సాగుచేసిన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల తో పాటు  రైతుబంధు డబ్బులు  రావని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎక్సైజ్  సీఐ  రూప్ సింగ్, తహసిల్దార్  ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి  సంజీవరావు, ఏఎస్‌ఐ  నాగేశ్వరరావు లతో  అటవీ శాఖ సెక్షన్ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.