షాద్‌నగర్ చౌరస్తా విస్తరణపై పరిశీలించిన అధికారులు
షాద్ నగర్ జూలై 3 (విజయక్రాంతి): ‘నరకప్రాయంగా షాద్ నగర్ చౌరస్తా‘ అంటూ జూన్ 30వ తేదీన విజయ క్రాంతి లో ప్రచురితమైన కథనానికి ప్రతిస్పందన లభించింది షాద్నగర్ చౌరస్తాలో చౌరస్తాను. విస్తరించకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల నరకప్రాయంగా షాద్నగర్ చౌరస్తా.. అంటూ కథనం నేపథ్యంలో ఉన్నతాధికారులు శుక్రవారం నాడు షాద్నగర్ చౌరస్తా విస్తరణ పై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
ఈ పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవో సరిత, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, సీఐ సీతారాం, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ టీపీఓ పావని, ఆర్ అండ్ బీ శాఖ ఏఈ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు షాద్నగర్ చౌరస్తా విస్థరణ చేయకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు మొదల నేపథ్యంలో ప్రమాదాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఆర్ ఎన్ రాము విస్తరించాలని కోరుతూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు చౌరస్తానని విస్తరించాలని కోరుతూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీంతో షాద్నగర్ చౌరస్తా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.






