4 July, 2026 | 3:29 AM

ఆర్డిఓకు భారత రాజ్యాంగ పీఠిక అందజేత

04-07-2026 02:32 AM

ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ విజిలెన్స్ జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్ బేగరి రాజు 

చేవెళ్ళ జులై 3(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్  కమిటీ రంగారెడ్డి జిల్లా మెంబర్ నియమించబడిన సందర్భంగా శుక్రవారం చేవెళ్ల ఆర్డిఓ కె.పార్థసింహ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి డా. బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పీఠికను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డిఓ  ఇలా అన్నారు...

ఎస్సి,ఎస్టీలను ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడడం నేరమని, మా పరిధిలోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ భూముల ఇతరాత్ర ఏ సమస్యలయినా తక్షణమే పరిష్కరించడానికిసిద్ధంగా ఉన్నా మన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంద న్నారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామని తమ నోటిస్ లో ఉన్న కేసులకు పరిస్కారమార్గం చూపుతామన్నారు.

అనంతరం ఎస్సీ,ఎస్టీ అట్రాక్సిటీ విజిలెన్స్& మానిటరిక్ కమిటీ రంగారెడ్డి జిల్లా మెంబర్ బ్యాగరి రాజు ను ఘనంగా సన్మానించారు. మునుముందు ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల పరిష్క రించుకుందామని కమిటీ సభ్యులకు చూచిం చారు. ఈ కార్యక్రమంలో అసైన్ భూముల సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పర శ్రీనివాస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.