రెండో వన్డేలో కివీస్ విజయం
గయానా, జూలై 14 : వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ జేసర్ లిన్నెక్స్ ఐదు వికెట్లతో విండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జాన్ కాంప్బెల్ (43) టాప్ స్కోరర్గా నిలవగా, అమిర్ జాంగో (24) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేడన్ లెన్నోక్స్ 5 వికెట్లతో విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు.
మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 32.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టామ్ లాథమ్ (37 నాటౌట్),మైకెల్ బ్రాస్వెల్ (24 నాటౌట్) కివీస్ణు విజయతీరాలకు చేర్చారు.
అంతకముందు విల్ యంగ్ (28), డారిల్ మిచెల్ (28) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఖారీ పియర్రె 2 వికెట్లు తీయగా, అల్జారీ జోసెఫ్, గుదకేశ్ మోతీ చెరొక వికెట్ పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1- సమంగా నిలిచాయి. సిరీస్‌లో మూడో మ్యాచ్ జూలై 16న జరగనుంది.






