15 July, 2026 | 1:46 AM

‘మహా’ డిప్యూటీ సీఎం సునేత్ర ఇంట పెళ్లిబాజా

15-07-2026 01:46 AM

మోడల్ కైనత్‌తో సునేత్ర కుమారుడు పార్థ్ వివాహం

ముంబై, జూలై 14: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ కుటుంబంలో పెళ్లి బాజా మోగనుంది. ఆమె పెద్ద కుమారుడు, రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్ పెళ్లి చేసుకోనున్నాడు. మోడల్, వ్యాపారవేత్త అయిన కైనత్ ధర్‌ను పార్థ్ వివాహం చేసుకుంటాడని, జూలై 29న వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని ఆహ్వాన పత్రికును ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పవార్ కుటుంబ సభ్యులకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా రాజకీయ కుటుం బంలో అడుగిడబోతున్న కైనత్ ధర్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన కైనత్ ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసి మోడల్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. కాగా పెళ్లికి ముందే కైనత్, పార్థ్లు పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర ఆలయా సంద ర్శన, అజిత్ పవార్ మృతి తర్వాత జరిగిన సంతాప సభలలో కైనత్ హాజరయ్యారు. ఈ విధంగా వారు కలిసి కనిపించడం వల్ల, వారిద్దరూ సన్నిహితంగా ఉన్నారనే పుకార్లు మరింత బలపడ్డాయి. ఇప్పుడు నిశ్చితార్థం ప్రకటన వచ్చింది.