23 April, 2026 | 1:57 AM

అకాల వర్షంతో రైతుల ఆగం

23-04-2026 12:35 AM

అయిజ ఏప్రిల్ 22: అయిజ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట చేజారిపోయిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే అయిజ మండలంలో కురిసిన గాలివానకు చిన్నతాండ్రపాడు, ఉప్పల, నౌరోజిక్యాంపు, కేశవరం మొదలగు గ్రామాలలో కోతకొచ్చిన వరి పంట నెలకు రాలిందని మరియు వేరుశనగ తడిసి ముద్దయిందని మరియు మేడికొండ గ్రామంలో రెండు ఎకరాల అరటి తోట నెలకొరిగిందని, సుమారు 800 ఎకరాలలో పంట నష్టం జరిగి ఉంటుందని వ్యవసాయ అధికారి ఏవో జనార్ధన్ అన్నారు.

రైతు ఆరుగాలం కష్టం పండించిన పంట ఇలా ప్రకృతి తాపానికి గురి కావడం రైతులు జీర్ణించుకొలేని సంఘటనని రైతులు ఆవేదన చెందారు. ఇట్టి విపత్తుతో రైతులకు జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏవో జనార్ధన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నతాండ్రపాడు సర్పంచ్ మహేశ్వరమ్మ భర్త సుధాకర్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.