అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): అర్హులైన వారికి ఆకిరీడేషన్ కార్డులు అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టరేట్ మినీ సమావేశం హాలు లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని అన్నారు. 252 జీఓ ననుసరించి నియమ నిబంధనలు తప్పకుండ పాటించాలన్నారు.
మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.






