calender_icon.png 14 February, 2026 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం

14-02-2026 07:07:22 PM

అచ్చంపేట: అచ్చంపేటలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పార్వతి పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని  ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు తెలిపారు. వేడుకల్లో భాగంగ శనివారం ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేసి పార్వతి పరమేశ్వరులను పెళ్లి కుమార్తెను, పెళ్లి కుమారుని సొంతంగా ముస్తాబు చేశారు. దేవేరులకు మంగళ స్నానాలు చేయించారు.

లోక కళ్యాణార్థం రుద్రహోమం చేశారు. మహిళ సంఘం ఆధ్వర్యంలో మహిళలు అందరూ గాజులతో అలంకరించుకొని గోరింటాకు పెట్టుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా భజనలు కోలాటాలతో తీసుకువస్తారు. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల దివ్య శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు.

పరమేశ్వరుల తరపున కోట ప్రశాంతి కిషోర్, పార్వతి దేవి తరపున కర్నాటి నిర్మల నారాయణ దంపతులు కల్యాణంలో పాల్గొంటారనీ చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు, చిలువేరు ధనరాజ్, కర్నాటి రాములు, కర్నాటి నారాయణ, వనం వేణు, గుజ్జరి నర్సింహ, గంజి జగదీష్, ఇమ్మడి రమేష్, కర్నాటి నవీన్, మాకం శేఖర్, శకుంతల, గీత పాల్గొన్నారు.