17 July, 2026 | 9:48 PM

దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా వెద్యాధికారి డా. కే. కృష్ణ

17-07-2026 09:39 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమకాటు వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కే. కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్‌ కర్నూల్ పట్టణంలోని రామాలయం పరిసరాల్లో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన, ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి పాత్రలను వారానికోసారి శుభ్రపరచాలన్నారు. పనికిరాని టైర్లు, ప్లాస్టిక్ సీసాలు, కొబ్బరి చిప్పలు వంటి వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ఆరోగ్య కేంద్రంలో రక్తపరీక్ష చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.