8 July, 2026 | 1:14 AM

మహిళలు, బాలికల భద్రతపై షీ టీం అవగాహన

08-07-2026 12:12 AM

బచ్చన్నపేట, జూలై 7 (విజయక్రాంతి): మహిళలు, బాలికల భద్రత, వేధింపులపై అవగాహన కల్పించేందుకు జనగామ జిల్లా షీ టీం ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షీ టీం ఎస్‌ఐ లలిత ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జెడ్పీహెచ్‌ఎస్, తుమ్మ బల పాఠశాలల్లో విద్యార్థినులకు అవగాహన తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ లలిత మాట్లాడుతూ, షీ టీంను ఎలా సంప్రదించాలి, వేధింపులు ఎదురైనప్పుడు ఫిర్యాదు ఎలా చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలి, మహిళలు, బాలికల భద్రత కోసం అందుబాటులో ఉన్న సేవలు వంటి అంశాలపై విద్యార్థినులకు వివరంగా అవగాహన కల్పించారు.

వేధింపులకు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తక్షణ సహాయం కోసం 100 డయల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బందితో పాటు బచ్చన్నపేట పోలీసులు పాల్గొన్నారు.