వాగ్దేవి అద్భుత విజయం
వాగ్దేవి అకాడమీ కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి
మహబూబ్ నగర్: నీట్ యూజీ 2026 పరీక్ష ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి నీట్ అకాడమీ విద్యార్థులు విజయ డంకా మోగించారని వాగ్దేవి అకాడమీ కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. వన్ క్లాస్ ప్రత్యేక ప్రోగ్రాం తో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ తో నాణ్యమైన విద్యను అందించి జాతీయస్థాయిలో మేము సైతం అంటూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సాధారణ విద్యార్థులు సైతం డాక్టర్లుగా మార్చిన ఘనత వాగ్దేవి అని ఇంతటి ఘనవిజయానికి అధ్యాపకుల సమిష్టి కృషి అని మట్టిలో మాణిక్యాలై ఆర్థికంగా వెనుకబడిన కొందరు నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ వారి జీవిత కల అయినా డాక్టర్ కావడాన్ని నిజం చేసిన ఘనత వాగ్దేవి అకాడమీకి దక్కిందని తెలిపారు.
68 మంది విద్యార్థులలో 554 మార్కులతో ధర్మ ,465 మార్కులతో సిద్ధార్థ ,452 మార్కులతో రబ్ షా 32 పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న విద్యాసంస్థ వాగ్దేవి నీట్ అకాడమీ కావడం చాలా సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి నీట్ అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి నందన్ రెడ్డి అకాడమీ అడ్వైజర్ యాకూబ్ ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్ ఎగ్జామినేషన్ ఇంచార్జ్ చెన్నయ్య,యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్, సతీష్ రెడ్డి నాగేందర్, రాఘవేంద్రరావు, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






