17 July, 2026 | 9:35 PM

భవిష్యత్తులో ఓటు వేయాలి ఇలా!

17-07-2026 09:34 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): భవిష్యత్తులో విద్యార్థులు వయోజనులైన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కల్పించేందుకు కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల నిర్వహణ విధానం, ఓటర్ల బాధ్యతల గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. మాక్ ఎన్నికల్లో విద్యార్థులు ఓటర్లుగా, పోలింగ్ సిబ్బందిగా, అభ్యర్థులుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ఉత్సాహంగా నిర్వహించారు. ఓటరు జాబితా పరిశీలన, ఓటు నమోదు, రహస్య బ్యాలెట్ విధానం, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకున్నారు.