17 July, 2026 | 9:44 PM

రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా అవసరం

17-07-2026 09:36 PM

- జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే విధంగా సంఘ విద్రోహులు రౌడీ షీటర్లపై ప్రత్యేక నజర్ పెట్టాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర న్యాయం అందించాలని, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఎస్పీకి సూచించారు. అనంతరం పాత పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నూతన డాగ్ స్క్వాడ్ భవనాన్ని ప్రారంభించారు. నేరాల ఛేదన, విస్ఫోటక పదార్థాల గుర్తింపు, వీఐపీ భద్రతలో పోలీస్ జాగిలాల సేవలు కీలకమన్నారు. జిల్లాలో 7 పోలీస్ జాగిలాలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.