రైతు హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు
17-07-2026 09:29 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వంట మార్పిడి పద్ధతులు సూచనలు సలహాల కోసం కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు లోటు వర్షపాతం కారణంగా పత్తి వారి పంటలు వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి కావలసిన సూచనలు సలహాలు అందించడం జరుగుతుందన్నారు
రైతులకు వాతావరణ సంబంధించిన అంశాలు కానీ పంటలకు సంబంధించిన అంశాలను నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్ 89777 51785 నంబర్లు సంప్రదించాలని సూచించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా రైతులకు సూచన సలహాలు అందించడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్విని చూసుకోవాలని సూచించారు.






