10 July, 2026 | 3:09 AM

పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి

10-07-2026 01:35 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

ఘనపురం, జులై 9(విజయక్రాంతి):  పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి, శ్రీ పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ దేవతల పూజలు మన సంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.