calender_icon.png 5 February, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సీలింగ్ భూముల్లో అక్రమ కట్టడాలు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు

05-02-2026 12:00:00 AM

అలంపూర్, ఫిబ్రవరి 4:గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహదారి పక్కనున్న ప్రభుత్వ సీలింగ్ భూములను కొందరు భూఅక్రమార్కులు దర్జాగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నార ని వారి పైన సంబంధిత అధికారులు విచారణ చే పట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు జయరాజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు బుధవారం మండల ఎంపీడీవో తిరుపతన్న కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పక్కనున్న 451 సర్వే నంబర్లో నాలుగు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి కలిగి ఉందని అట్టి ప్ర భుత్వ సీలింగ్ భూమిలో 50 సెంట్ల భూమిని కర్నూల్ కు చెందిన భోగేశ్వర్ రెడ్డి, స్థానికంగా ఉంటున్న మరో వ్యక్తితో కలిసి ఆక్రమించుకొని అట్టి భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ తోపాటు .. బోరును వేసి రెస్టారెంట్ ను నిర్మిస్తున్నట్లు అధికారులకు విన్నవించారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ తంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి తెలిపిన ... గ్రామ సెక్రెటరీ అక్రమార్కులకే వత్తాసు పలుకుతూ ...నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇంత వరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి అధికారులు విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.