calender_icon.png 4 February, 2026 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరు కార్పొరేషన్ డిమాండే వేరు

04-02-2026 10:45:06 AM

  1. 60 మంది కార్పొరేటర్ల ఎన్నికకు 347 మంది బరిలో 
  2. పోటీ లో 127 మంది స్వతంత్ర అభ్యర్థులు 
  3. టికెట్ల ఖరారు చివరి వరకు తేవడం తో విత్ డ్రా జరగలే!
  4. అధికార ప్రతిపక్ష పార్టీలలో రెబల్స్ అభ్యర్థులు

మహబూబ్ నగర్ (విజయక్రాంతి):  మహబూబ్ నగర్ తొలి కార్పోరేటర్ అయ్యేందుకు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పాలమూరు కార్పొరేషన్ లో 60 మంది కార్పొరేటర్ లను ఎన్నుకోవలసి ఉండగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఇంత ప్రజలతో ఉందో ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం నెలకొంది. అప్ 2, బీజేపీ 52, బిఎస్పి 7, సిపిఎం 1,కాంగ్రెస్ 60,ఎంఐఎం 16, బీఆర్ఎస్ 58,ఎఐఎఫ్ బీ 3, ఐయుఎంఎల్ 2,జేయస్పి 18, ఇతర పార్టీ 1, స్వతంత్ర అభ్యర్థులు 127, మొత్తం 347 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

బిజెపి పార్టీ 60 డివిజన్లో పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ 52 డివిజన్లను మాత్రమే బరిలో తమ అభ్యర్థులను నిలిపింది. బీఆర్ఎస్ పార్టీ సైతం 58 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో ఉంచింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో 60 డివిజన్లో 60 మంది అభ్యర్థులను పోటీలో ఉంచడం ఉంచింది. పార్టీ అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం సాయంత్రం గుర్తులను కేటాయించి బరిలో నిలుచున్న అభ్యర్థులకు అందజేశారు. 

నేడు అభ్యర్థులతో ఎన్నికల సంఘం సమావేశం

 బరిలో నిలుచుండే అభ్యర్థుల తో ఎన్నికల ఖర్చులతో పాటు నియమ నిబంధనలు తెలియజేసినందుకు ఎన్నికల సంఘం అధికారులు బుధవారం అంబేద్కర్ కళాభవన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభ్యర్థులు అంబేద్కర్ కళాభవన్ చేరుకోవాలని ఎన్నికల సంఘం ఒక ప్రకటన లో తెలియజేసింది. 

అన్ని పార్టీలలో రెబల్స్

ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని పార్టీలలో రెబల్స్ బెడద పట్టుకుంది. మంగళవారం విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ చివరి దశ వరకు టికెట్ల తుది నిర్ణయం రాకపోవడంతో చాలామంది అభ్యర్థులు కొన్ని వార్డులలో పార్టీ ఇలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బరిలో నిలవడం విశేషం. ముజస్తుగా టికెట్లు కేటాయించి ఉంటే బరిలో నిలుచుండే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నుంచి తప్పించేందుకు అవకాశాలు ఉండేవని తెలుస్తుంది. సమయం తక్కువగా ఉండడంతో అదే సమయంలో తుది జాబితా ప్రకటించడంతో ఆయా పార్టీలలో రెబల్స్ బెడద కూడా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. విత్ డ్రా చేసుకోకపోయినా కొంతమందిని మౌనంగా ఉంచేందుకు ఆయా పార్టీల నేతలతో పాటు అభ్యర్థుల సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు మేధావులు చెబుతున్న మాట.