calender_icon.png 5 February, 2026 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీని ఆదరిస్తే ఏడాదిలోపు పరిశ్రమ

05-02-2026 12:00:00 AM

కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 4:  కొల్లాపూర్ మున్సిపాలిటీలో  బీజేపీనీ ఆదరిస్తే వెయ్యి మంది పనిచేసే నూతన పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుధాకర్ రావు అన్నారు.  బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10, 11, 12 .వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి గెలిచిన వార్డు అభివృద్ధి కోసం పది లక్షలు సొంతంగా ఇస్తానన్నారు. 

అడ్డపిల్లకు పెళ్లయితే పుస్తె మెట్టె కుంకుమ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను చదివిస్తానని డిగ్రీ చదివిన వారికి స్కాలర్షిప్లు అందజేస్తానని హామీలు గుప్పించారు. వారితోపాటు నాయకులు నారాయణ, శీను. రమేష్ తదితరులు పాల్గొన్నారు.