calender_icon.png 5 February, 2026 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ న్యాయవాది స్వప్న దారుణ హత్య

04-02-2026 08:57:07 PM

- ఖండించిన న్యాయవాది సురేష్

బెజ్జంకి: మహిళా న్యాయవాది స్వప్న హత్య నిజంగా అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన విషయం, సమాజంలో న్యాయం కోసం పోరాడే వ్యక్తులకే రక్షణ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం అని న్యాయవాది లింగాల సురేష్ ఒక  ప్రకటనలో తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మొహీనాబాద్ చేవెళ్ల లో ఒక మహిళా న్యాయవాది పై ఇలాంటి అమానవీయ దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, మొత్తం న్యాయవాద వృత్తికే అవమానమని పేర్కొన్నారు.న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలనీ,విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం, పోలీసులు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ. నిందితులను తక్షణమే గుర్తించి, వారికి చట్టపరంగా కఠినమైన శిక్ష పడేలా చూడాలని కోరారు.