calender_icon.png 4 February, 2026 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజేయు జిల్లా ఉపాధ్యక్షులుగా దేవులపల్లి భూపతి

04-02-2026 08:54:11 PM

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేయు) జిల్లా ఉపాధ్యక్షులుగా దేవులపల్లి భూపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ లో జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పూర్తి స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి తూర్పుంటి శ్రీనివాస్, సంఘటన కార్యదర్శి శ్రీకాంతాచారి, సహాయ కార్యదర్శి భరత్, పశుపతి, సలహాదారులు సాగర్ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవి, గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షులు గుండాల శేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి అల్లం రాజు, మరాటి బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.