calender_icon.png 5 February, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ఫ్లెక్సీల తొలగింపు.. ఆగ్రహం వ్యక్తం చేసిన గులాబీ నేతలు

05-02-2026 12:00:00 AM

జడ్చర్ల, ఫిబ్రవరి  4: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీ లు తొలగించడం వివాదాస్పదమయింది.నిన్న ప్రోగ్రామ్ జరిగితే ఇవాళ తెల్లవారుజామునే అన్ని ఫ్లెక్సీ లు  తొలగించడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా జడ్చర్ల లో  కొత్త సంప్రదాయానికి అధికారులు తెరతీసారని మండిపడ్డారు. భవిష్యత్తు లో అన్ని పార్టీల పట్ల ఇదే రకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.