05-02-2026 12:00:00 AM
భక్తులతో కిటకిటలాడిన పరమశివుని శోభాయాత్ర
శ్రీరంగాపురం ఫిబ్రవరి 4:మండల కేంద్రంలోని ఆది బసవన్న ఆలయంలో బుధవారం నాడు శివ స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రుద్రాభిషేకం భక్తుల మనసులను పరవశింపజేసింది. ఉదయం నుంచే ఆలయంలో ఓంకార నాదాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య పరమ శివునికి అభిషేకాలు ఘనంగా కొనసాగాయి. యువతీ యువకులు భక్తిగీతాలకు తాళం వేసి నృత్యాలు చేయడం అందరినీ ఆకట్టుకుంది.
శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆది బసవన్న ఆలయ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గురుస్వామి మాట్లాడుతూ శివ భక్తి ద్వారా మనస్సుకు శాంతి, సమాజానికి ఐక్యత లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.