Cinema

‘ప్యారడైజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
‘ప్యారడైజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

హైదరాబాద్: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘జడల్ జమానా తన అడ్డాకు చేరుకొంది’ అంటూ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టాక్‎ను సొంతం చేసుకున్నాయి. దీంతో సినిమా విడుదలపై నాని అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

20-09-2026 | 03:20pm

రాకాలోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ విలన్!
రాకాలోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ విలన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్, ఆస్కార్ విజేత విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అల్లు అర్జున్‌కు పోటీగా నిలిచే ప్రతినాయకుడి పాత్ర కోసం విల్ స్మిత్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం ఆయనకు సుమారు రూ.80 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

20-09-2026 | 02:55pm