04-02-2026 12:00:00 AM
మలయాళ స్టార్ టొవినో థామస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పళ్లిచట్టంబి’. ఈ సినిమాను వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందింది. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ కథతో తెరకెక్కించారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 9న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ మూవీ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కథానాయిక కయదు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘డ్రాగన్’ మూవీ సక్సెస్ తర్వాత ప్రేక్షకుల్లో కయదుకు పెరిగిన క్రేజ్ ఈ సినిమాను ప్రత్యేక ఆకర్షణ కానుందని టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్; సినిమాటోగ్రఫీ: టిజో టోమీ; ప్రొడక్షన్ డిజైన్: దిలీప్‌నాథ్; ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్; స్క్రిప్ట్: ఎస్ సురేశ్‌బాబు; నిర్మాతలు: నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్; డైరెక్టర్: డిజో జోస్ ఆంటోనీ.