calender_icon.png 5 February, 2026 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ది నెల రోజులు వెనక్కి

05-02-2026 01:15:24 AM

రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ -యాక్షన్ డ్రామా ‘పెద్ది’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. తాజాగా పవన్‌కల్యాణ్ సినిమా విడుదల తేదీని ప్రకటించటంతో బాబాయ్ సినిమా కోసం అబ్బాయి నెల రోజులు వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 30కి మార్చారు. ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు డీవోపీగా నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.