05-02-2026 01:24:47 AM
మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార ణాసి’. ఈ సినిమాతో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా 2027, ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది టీమ్. ఇదిలావుంటే, ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పిన విశేషాలు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం ఒప్పుకునే ముందే ప్రియాంక రాజమౌళికి ఒక చిన్న కండీషన్ పెట్టిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాను స్వయంగా రాజమౌళిని కోరి మరీ ఒక డాన్స్ సాంగ్ అడిగి తీసుకున్నానని, అయితే, అది ఇంత కష్టంగా ఉంటుందని ఊహించలేదంటూ నవ్వేసింది. “చాలా కాలంగా నేను ఇండియన్ సినిమాలో డాన్స్ చేయలేదు. అందుకే రాజమౌళితో నాకు ఒక సాంగ్ కావాలని అడిగాను. కానీ, ఆయన నాతో చేయిస్తున్న డాన్స్ చూస్తుంటే..
ఎందుకు అడిగానా..? అనిపిస్తోంది” అంటూ ప్రియాంక నవ్వుతూ చెప్పుకొచ్చింది. మహేశ్‌బాబు స్పంది స్తూ.. ‘కేవలం ప్రియాంక వల్లే నేను కూడా ఈ భారీ స్టెప్పులు వేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఒక సాంగ్ షూట్ పూర్తి చేశాం. అది నిజంగా సెన్సేషనల్‌గా వచ్చింది. ఆ పాట ట్యూన్ మా మనసుల్లో నుంచి అస్సలు పోవడంలేదు’ అన్నారు. ప్రియాంక అడిగినందుకే రాజమౌళి ఆ పాటను అంత గ్రాండ్‌గా, చెమటలు పట్టించేలా డిజైన్ చేశారని మహేశ్ చమత్కరించారు.