calender_icon.png 5 February, 2026 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకర్‌లో బుల్లెట్ సునీల్‌గా..

05-02-2026 01:18:10 AM

స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న హై-ఆక్టేన్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానున యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

బుధవారం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పాత్రను ‘బుల్లెట్ సునీల్’గా పరిచయం చేస్తూ మేకర్స్ రీ-స్టార్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రాజశేఖర్ ఇందులో విశ్రాంత మోటోక్రాస్ రేసర్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్; సినిమాటోగ్రఫీ: జే యువరాజ్; ఎడిటింగ్: అనిల్‌కుమార్ పీ; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం.